The tradition & historical record
4 min read · 2 sourcesగంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఇతరులకు సన్నాయి పాటలను వినిపించి డోలు కొట్టి, శిక్షణ నిచ్చిన గంగిరెద్దును పట్టుకొని తిరిగే గందిరెద్దులోళ్ళు జీవితాలు చీకటి మయమయ్యాయి. స్థిర నివాసాలు లేనివారు, భూములు లేని వీరికి విద్యా, ఉద్యోగం, మొదలగు వాటిలో వున్న రిజర్వేషన్లు వీరికి తెలియవు. 1
గంగిరెద్దాటలు
"గంగిరెద్దుల వాడు కావర మణచి - ముకుతాడు పొడిచి పోటెద్దులట్లు" అని పలనాటి వీర చరిత్రలో శ్రీనాథుడు ఉదహరించడాన్ని బట్టి అతి ప్రాచీన కాలం నుంచీ ఈ గంగి రెద్దాటలు ప్రచారంలో వున్నాయని తెలుస్తుంది. 1
గంగిరెద్దుల ఆటకు మూలం
పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. అప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి...గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించ మని కోరుతాడట. అందు కోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమై న నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు. వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట (మందస ప్రాంతంలో), మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. 1
గంగిరెద్దుల వారు
ఈ ఇంటికి మేలు జరుగుతాదని చెప్పు, మంచి జరుగుతాదని చెప్పు అంటూ గంగిరెద్దులతో తలలను ఊపిస్తారు. ఒక నాడు దేదీప్యమానంగా వెలిగిన గంగిరెద్దాటలు వ్యాచక వృత్తిని అవలంబించినా అవి విద్వత్తును ప్రదర్శించే గంగి రెద్దుల మేళంగానూ, ప్రజలను వినోద పర్చి ఆనందింప చేసే కళా రూపంగానూ ఖ్యాతి వహించింది. గంగిరెద్దుల మేళాల వారు, రెండు మూడు కుటుంబాలు కలిసి అయిదారు అందమైన బలిసిన గంగిరెద్దులతో దండుగా బయలు దేరి ఆంధ్ర దేశంలో ఆ మూల నుంచి ఈ మూల వరకూ మకాంలు వేస్తూ జీవ యాత్రలు చేసే వారు. ఒకప్పుడు రాజులూ జమీందారులూ వారి వారి ప్రాంగణాలలో గంగి రెద్దులాటను ఏర్పాటు చేసుకుని వినోదించే వారు. గంగి రెద్దుల వారు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఉన్నారు. అయితే వారిలో ఎక్కువ మంది తెలుగు భాషనే మాట్లాడుతారు. వీరికి ఒక వూరనేది లేదు. సంచార జీవులైన వీరు పర్వ దినాలలోనూ, ముఖ్యంగా రైతులకు పంటలన్నీ చేతికి వచ్చి పని పాటలు లేని సమయాల్లోనూ, సంక్రాంతి పండుగ దినాలలోనూ వూర్ల వెంట బయలు దేరుతారు. 1
జీవన విధానం
గంగిరెద్దులోళ్ళు యాదవులలో ఒక భాగమని చెప్పుకుంటారు. గొల్లలకు వీరికి ఇంటి పేరు, గోత్రము ఒకే విధముగా ఉంటాయి దీనికి ఇదే బలమైన ఆధారం. గతంలో గంగిరెద్దుల కులస్థులలో మగవారు గంగిరెద్దు పట్టుకొని ఊరంతా తిరిగితే ఆడవారు గ్రామాలలో కరక్కాయలు, దగ్గుమందులు, గిలకలు అమ్మేవారు. నేడు ఆ పరిస్థితులు మారటంతో ఆడవారు ఫ్యాన్సీ సామానులైన బొట్లు, కాటుకలు, తిలకాలు, అద్దాలు, పైనలు (దువ్వెనలు) ఊరూరా అమ్ముకుని వస్తున్నారు. కొన్ని చోట్ల ఆడవారు ఈత చాపలు, బుట్టలు, గిలకలు అల్లటం చేస్తుంటాయి. ఆధునికత సంతరించక ముందు ప్రజలు గంగిరెద్దుల వారిని ఆదరించి బట్టలు, భత్యం, డబ్బులు యిచ్చి చనిపోయిన తాత తండ్రుల పేరు మీద పొగిడించేవారు. గ్రామాలలో వివిధ ప్రదేశాలలో గంగిరెద్దు విన్యాసాలు చేయించేవారు. ఈ రోజు ఆ పరిస్థితులు మారిపోయి భిక్షాటకుల కంటే అధ్వానంగా తయారైనారు. ఊరంతా గంగిరెద్దు తిప్పినా పూట గడవని పరిస్థితి. తమలాగే తమ పిల్లలు కూడా గంగిరెద్దుని తీసుకొని వెళ్ళటం, ఆడపిల్లలు ఫ్యాన్సీ సామాన్లు అమ్మటం జరుగుతుంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా నిరక్షరాస్యులే. ఇక గంగిరెద్దు విషయానికి వస్తే గంగిరెద్దే గంగిరెద్దులవారి ఆస్తి. పూర్వపు రోజులలో దేవుడు పేరు మీదుగా మొక్కుకున్న గంగిరెద్దు ప్రజలు ఉచితంగా యిచ్చేవారు. కొన్ని ప్రాంతాలలో ఉచితంగా యిస్తున్నా సింహాచలం దేవస్థానంలో మాత్రం గంగిరెద్దు వేలం పాడుకొని కొనుక్కోవలసి ఉంటుంది. ఒక్కొక్క గంగిరెద్దు రూ.1000 నుండి రూ.2000 వరకు పలుకుతుంది. అంత స్తోమత గంగిరెద్దుల వారికి లేదు. సింహాద్రి అప్పన్నను ఊరూరా వాడ వాడా పొగడటమే తప్ప సింహాచలం దేవస్థానం నుండి వీరికి ఎటువంటి సహాయం అందటం లేదు. భద్రాచల రాముని పేరు మీద, తిరుపతి వెంకన్న పేరుమీద, వేములవాడ రాజరాజేశ్వరి పేరుమీద రాష్ట్రమంతటా పొగిడి గంగిరెద్దును తిప్పే గంగిరెద్దుల వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఉన్నారు. గంగిరెద్దులు వారు సంక్రాంతికి ముందే కొన్ని ప్రాంతాలకు వలస పోతుంటారు. ఒక్కొక్క గ్రామంలో గుడారాలు వేసుకొని వారం, పది రోజులు నివాసం ఉండి పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేస్తారు. శివరాత్రి సరికి గ్రామాలు చేరుకుంటారు. 1
ఆటను నేర్పటం.
వయసులో వున్న కోడె గిత్తల్ని తీసుక వచ్చి, వాటి ముక్కులకు ముకుతాడు కట్టి వాటి పొగరు బోతు తనాన్ని అణగ గొట్టి, వాటిని లొంగ దీసుకుని, చెప్పినట్ట్లు చేసేలా తయారు చేసే వారు. ఉదాహరణకు సర్కస్ జంతువులకు తరిఫీదు ఇచ్చినట్లు. ఇలా వాటిని కొన్ని మాసాల పాటు మచ్చిక చేసుకునే వారు. వాయిద్యానికి అనుకూలంగా అడుగులు వేయించటం, పరుగెత్తించటం, పడుకోబెట్టటం, అటూ ఇటూ దొర్లటం, మూడు కాళ్ళ మీద నుంచో పెట్టటం, చిట్టి అడుగులతో నృత్యం చేయటం, దూడూ బసవన్నా, రారా బసవన్నా అంటూ వాటిని పరుగులు పెట్టించటం, కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానంగా తల వూపించటం, సలాం చేయమంటే కాలు పైకెత్తి సలాం చేయటం, ఆడించే వాడు వెల్లకిలా పడుకొని తన గుండెలమీద గంగి రెద్దు ముందు రెండు కాళ్ళను, తొడలమీడ వెనక కాళ్ళను పెట్టించుకుని వూపడం, ఇలా ఎన్నో విద్యల్ని కొన్ని మాసాలపాటు నేర్పి వీధిలోకి ప్రదర్శనకు తీసుకవస్తారు. 1
The text above is adapted from the Wikipedia article “గంగిరెద్దులాటలు”, available under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence. 1
Gangireddu (Decorated Bull) is traditional folk performance associated with the Sankranti festival in Telangana and Andhra Pradesh, according to the structured record cited below. This entry was generated automatically from that record and has not yet been reviewed by a person familiar with the tradition. 2