The tradition & historical record
2 min read · 2 sourcesసుగాలీ లంటే లంబాడీ లు. ఈ నృత్యాన్ని, లంబాడీ, బంజారా తండా నృత్యమని పిలుస్తారని డా. చాగిచర్ల కృష్ణారెడ్డి గారు తమ జానపద నృత్య కళా గ్రందంలో ఉదహరించారు. అయితే వీరు ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజనులుగానే మిగిలిపోయారు. పల్లెలకు దూరంగా కొండ కోనల్లో నివసిస్తూ కట్టెలు కొట్టి అమ్ముకుంటూ, కూలి పనులతో జీవనం సాగిస్తారు. వీరు కష్టజీవులు. పండగలు, పబ్బాలూ సాంప్రదాయ రీతిలో చేసుకుంటారు. వీరి వేషధారణలో, స్త్రీలు ప్రత్యేకమైన దుస్తుల్ని ధరిస్తారు. లంబాడీలను చూచిన వారికి వారి వేషధారణ విదితమే. వీరు తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వున్నా, అనంతపురం జిల్లాలో కూడా వున్నారు. వీరు ధర్మవరం మండలంలో ప్రతి సంవత్సరం కాముని పున్నమి రోజున తప్పకుండా నృత్యం చేస్తారు. మత్తు పానీయాలు బాగా సేవించి స్త్రీలు నృత్యం చేస్తారు. వీరి నృత్యంలో ముఖ్యంగా చేతులు చూపించటం, వలయా కారంగా తిరగటం చేస్తారు. ఈ నృత్యాన్ని స్త్రీ పురుషులిరువురు కలిసే చేస్తారు. ఒక పురుషుడు ప్రత్యేకంగా డప్పు కొడతాడు. డప్పు వరుసలకు అనుకూలంగా స్త్రీలు రక రకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతారు. వీరి నృత్య బ్రుందంలో 10 మంది వరకూ పాల్కొంటారు. వారి సంప్రదాయ దుస్తుల్ని ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. చప్పట్లు చరుస్తూ వలయాకారంగా శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. లయ ప్రకారం చప్పట్లు చరుస్తూ వుంటే మిగతా వారు పాటలను ఆలాపిస్తారు. వీరి పాటలన్నీ వారి గురువైన 'సేవలాల్ మీదనే పాడతారు. 1
యిచి కూడా చూడండి
లంబాడి 1
సూచికలు
తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ప్రచురించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు 1
The text above is adapted from the Wikipedia article “సుగాలీ నృత్యం”, available under the Creative Commons Attribution-ShareAlike 4.0 licence. 1
Sugali Lante Lambadi is type of dance, according to the structured record cited below. This entry was generated automatically from that record and has not yet been reviewed by a person familiar with the tradition. 2